Pawan Kalyan: భీమన్న ఖండ్రేగారి మృతికి చింతిస్తున్నా: పవన్ కల్యాణ్

Pawan Kalyan Condolences on Bheemanna Khandre Demise
  • కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ భీమన్న ఖండ్రే మృతి
  • ఆయన వయసు 102 సంవత్సరాలు
  • ఖండ్రే మృతికి సంతాపం ప్రకటించిన పవన్
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ భీమన్న ఖండ్రే మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఖండ్రే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

"కర్ణాటక రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, మిత్రులు ఈశ్వర్ ఖండ్రేగారి తండ్రి, మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ భీమన్న ఖండ్రేగారి మృతికి చింతిస్తున్నాను. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా భీమన్న ఖండ్రే తుదిశ్వాస విడిచారని తెలిసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వాతంత్ర్య సమరంలో, హైదరాబాద్ కర్ణాటక విముక్తి, కర్ణాటక సమైక్యత ఉద్యమాల్లో డాక్టర్ భీమన్న ఖండ్రే గారు కీలక పాత్ర పోషించారు. ఈశ్వర్ ఖండ్రే గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

కాగా, 102 ఏళ్ల వయసులో డా. భీమన్న ఖండ్రే కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా బీదర్ జిల్లా భాల్కి పట్టణంలోని తన నివాసంలో గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సమస్యలు, రక్తపోటుతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. డా. భీమన్న ఖండ్రే స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, అలాగే రవాణా మంత్రిగా కూడా సేవలందించారు. రాజకీయ, సామాజిక సేవలతో ఆయన కర్ణాటక ప్రజల్లో విశేష గౌరవాన్ని సంపాదించుకున్నారు.

Pawan Kalyan
Bheemanna Khandre
Karnataka
Eshwar Khandre
freedom fighter
condolences
political leader
Karnataka politics
Telugu news
death

More Telugu News