Nitish Kumar: బీహార్‌లో మద్య నిషేధంతో వచ్చిన మార్పులు ఏంటి?... ఐఐటీ కాన్పూర్ ఆసక్తికర అధ్యయనం
- బీహార్ మద్యపాన నిషేధంపై ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
- ప్రజల ఆహారపు అలవాట్లలో సానుకూల మార్పులు
- పెరిగిన ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వుల వినియోగం
- తగ్గిన ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం
- కుటుంబ కలహాలు తగ్గడం మరో సానుకూల అంశం
బీహార్‌లో 2016లో విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రజల ఆహారపు అలవాట్లపై సానుకూల ప్రభావం చూపిందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన ఈ నిషేధం వల్ల ప్రజలు మంచి తిండి తినడం మొదలుపెట్టారని గుర్తించారు. ప్రజల దైనందిన ఆహారంలో కేలరీలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల శాతం గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు, గింజల నుంచి తీసిన నూనెల వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాల వాడకం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ అధ్యయనం కోసం నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) రెండు వేర్వేరు సమయాల్లో (2011-12, 2022-23) సేకరించిన వినియోగదారుల ఖర్చు డేటాను విశ్లేషించారు. కాలక్రమేణా వచ్చే మార్పులను, ప్రాంతీయ ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకునేందుకు, బీహార్‌ను పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పోల్చి పరిశీలించారు. ఫలితాల కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి బహుళ గణాంక పద్ధతులను ఉపయోగించి, విస్తృతంగా తనిఖీలు చేశారు.
మద్యపాన నిషేధం వల్ల కుటుంబాల్లో డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, ఆ మొత్తాన్ని అనారోగ్యకరమైన వాటికి కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఖర్చు చేస్తున్నారని అధ్యయనం తేల్చింది. మద్యం కొనుగోలుకు దూరమవడం వల్ల ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా మద్యంతో పాటు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే.
"ఈ నిషేధం కేవలం కుటుంబ ఆర్థిక వనరులను ఆదా చేయడమే కాకుండా, ప్రవర్తనలోనూ సానుకూల మార్పులకు దారితీసింది. మద్యపానం తగ్గడం వల్ల కుటుంబ కలహాలు తగ్గాయి, ఇంట్లో స్థిరత్వం మెరుగుపడింది. పోషకాహారంపై ఖర్చు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు" అని ఐఐటీ కాన్పూర్ ఆర్థిక శాస్త్ర విభాగం పరిశోధకుడు వినాయక్ కృష్ణాత్రి వివరించారు.
సాధారణంగా ధాన్యాల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకునే బీహార్ లాంటి రాష్ట్రంలో ప్రోటీన్ల వినియోగం పెరగడం అనేది పాలసీపరంగా కీలకమైన విషయమని పరిశోధకులు పేర్కొన్నారు. చౌకగా లభించే అనారోగ్యకరమైన కొవ్వుల నుంచి నాణ్యమైన వంట నూనెల వైపు ప్రజలు మళ్లారని, ఇది వారి ఆహార నాణ్యతను మెరుగుపరిచిందని తెలిపారు. నిషేధం కఠినంగా అమలవుతున్న పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయి.
"ప్రధానంగా గృహ హింస, మద్యపాన సంబంధిత సామాజిక సమస్యలను తగ్గించే లక్ష్యంతో ఈ నిషేధాన్ని అమలు చేశారు. అయితే, ఇది అనుకోని విధంగా ప్రజలకు పోషకాహార, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించిందని మా అధ్యయనం చూపిస్తోంది" అని ఐఐటీ కాన్పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సుకుమార్ వెల్లక్కల్ తెలిపారు. మద్యంపై పెట్టే ఖర్చు ఆహారం వైపు మళ్లడం వల్ల ఆహార నాణ్యతలో అర్థవంతమైన మెరుగుదల కనిపించిందని ఆయన అన్నారు.