Ravi Teja: సునీల్ తో తన స్నేహం గురించి రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు

Ravi Teja Interesting Comments About Friendship With Sunil
  • నాది, సునీల్ ది వెటకారంతో కూడిన స్నేహం అన్న రవితేజ
  • మా అమ్మ, వాళ్ల అమ్మ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని వెల్లడి
  • వాళ్ల వెటకారాలే తమకు వచ్చాయన్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్ కాంబినేషన్ ఎప్పుడూ ఫన్ ఫుల్ గా ఉంటుంది. ఇద్దరి మధ్య స్నేహం కూడా సినిమాలకు అతీతంగా ఉంటుంది. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “నాది, సునీల్ ది విపరీతమైన వెటకారంతో కూడిన ఫ్రెండ్‌షిప్... మా అమ్మ, సునీల్ వాళ్ల అమ్మ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల వెటకారాలే మాకు వచ్చినట్లు ఉన్నాయి” అని చెప్పారు.


‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా, సునీల్, సత్య, వెన్నెల కిశోర్ వంటి కామెడియన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. రవితేజ చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడని అభిమానులు సంతోషిస్తున్నారు.
Ravi Teja
Sunil
Bharta Mahashayulaku Vijnapti
Telugu Movie
Tollywood
Comedy
Friendship
Dimple Hayathi
Ashika Ranganath
Sankranthi Release

More Telugu News