Ram Charan: తారక్ ఒక క్రేజీ, మ్యాడ్‌ డ్రైవర్‌: రామ్ చరణ్

Ram Charan says Tarak is a crazy mad driver
  • తారక్ డ్రైవింగ్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తానన్న రామ్ చరణ్
  • పెద్ది' సినిమా వాయిదా వార్తలను ఖండించిన గ్లోబల్ స్టార్
  • ముందు ప్రకటించినట్టు మార్చి 27నే సినిమా విడుదల అని స్పష్టత
టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు తారక్ డ్రైవింగ్ గురించి చరణ్ చేసిన సరదా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇండస్ట్రీలోని స్నేహితుల్లో ఎవరి డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చొని రైడ్‌ను ఆస్వాదిస్తారని అడగ్గా, చరణ్ వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పారు. "తారక్ ఒక క్రేజీ, మ్యాడ్ డ్రైవర్. అతని డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చొని బాగా ఎంజాయ్ చేయవచ్చు" అని నవ్వుతూ తెలిపారు. తారక్ కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చున్న ఇతర స్నేహితులకు ఎదురైన అనుభవాలను కూడా వారు తనతో పంచుకున్నారని చరణ్ సరదాగా గుర్తుచేసుకున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో తన తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీపై వస్తున్న వదంతులకు ఆయన స్పష్టతనిచ్చారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మార్చి 27న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ధృవీకరించారు. దీంతో సినిమా రిలీజ్‌పై ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ చిత్రంలో తాను మునుపెన్నడూ చేయని సరికొత్త పాత్రలో కనిపిస్తానని, జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోందని తెలిపారు. 

ఇక, తాను విజయం, అపజయం వంటివాటిని పెద్దగా పట్టించుకోనని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించనని చరణ్ పేర్కొన్నారు.


Ram Charan
Jr NTR
NTR
Peddi Movie
Buchi Babu
Janhvi Kapoor
Telugu cinema
Tollywood
Ram Charan Interview
Crazy Driver

More Telugu News