Ramchander Rao: బీఆర్ఎస్ పార్టీ ముక్కలవడం ఖాయం: రాంచందర్ రావు

Ramchander Rao BRS Partys disintegration is certain
  • మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్న రాంచందర్ రావు
  • ప్రజాల విశ్వాసాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల రాజకీయాలకు పరిమితమయిందని విమర్శ

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చూపిన కృషిని ఆయన అభినందించారు. దాదాపు ఐదు వేల సర్పంచ్ స్థానాల్లో పోటీ చేశామని, గతంతో పోలిస్తే బీజేపీ గెలుపు సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతోందనేందుకు స్పష్టమైన నిదర్శనమన్నారు.


బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని... ఆ పార్టీ ముక్కలవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల రాజకీయాలకు పరిమితమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని, అయినా కాంగ్రెస్ కేంద్ర పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Ramchander Rao
Telangana BJP
BRS Party
Municipal Elections
Revanth Reddy
Telangana Politics
BJP
Sarpanch Elections
Central Funds

More Telugu News