Ketireddy Peddareddy: రెండు కుటుంబాల మధ్యే తేల్చుకుందాం... జేసీ సవాల్ కు సై అన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి

Ketireddy Peddareddy Accepts JC Challenge for Debate in Tadipatri
  • జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ స్వీకరించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • 30 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటన
  • తేదీ ఖరారు చేస్తే రాయలసీమలో ఎక్కడైనా రెడీ అని ప్రకటన 
  • పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి... టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించారు. రాయలసీమ పౌరుషంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, "తాడిపత్రిలో జేసీ కుటుంబం 30 ఏళ్ల పాలన, నా 5 ఏళ్ల పాలనపై బహిరంగంగా చర్చించేందుకు నేను సిద్ధం. తేదీ, సమయం ఖరారు చేసి, జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇవ్వండి. రాయలసీమలో ఎక్కడైనా ఈ చర్చకు నేను వస్తాను" అని కేతిరెడ్డి ప్రకటించారు. 

ఈ చర్చకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకావాలని, ఇరు కుటుంబాల మధ్యే తేల్చుకుందామని ఆయన షరతు విధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. తాను ఆయనకు భయపడనని అన్నారు. గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తాను చేసిన వ్యాఖ్యలను జేసీ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో టీడీపీ నేతల అక్రమాలపై రెండుసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, జేసీ అడ్డుపడటంతో విచారణ జరగడం లేదని విమర్శించారు. తనను నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Ketireddy Peddareddy
JC Prabhakar Reddy
Tadipatri
Anantapur
Andhra Pradesh Politics
Rayalaseema
Political Challenge
YSRCP
TDP
Rayalaseema Lift Irrigation Project

More Telugu News