Telangana MLAs disqualification: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ బీజేపీ

Telangana MLAs Disqualification BJP Approaches Supreme Court
  • ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బీజేపీ
  • కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • సుప్రీంకోర్టు సూచనలు పాటించలేదని పేర్కొన్న బీజేపీ
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారానికి సంబంధించి బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని బీజేపీ సవాల్ చేసింది. కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీజేపీ నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

బీజేపీ శాసనసభా క్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, స్పీకర్ ఆ సూచనను పాటించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Telangana MLAs disqualification
Pocharam Srinivas Reddy
Kaleru Yadaih
Telangana Assembly
Speaker Prasad Kumar

More Telugu News