Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డేట్ వచ్చేసింది!

Prabhas Spirit Release Date Announced
  • ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' విడుదల తేదీ ఖరారు
  • 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న చిత్రం
  • టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ
  • హైఓల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా రానున్న 'స్పిరిట్'
  • ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది.

ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో ప్రభాస్, చిత్ర నిర్మాణ సంస్థలు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ రిలీజ్ డేట్‌ను పంచుకున్నారు.

'స్పిరిట్' ఒక హైఓల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. 'యానిమల్' బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'స్పిరిట్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Prabhas
Spirit Movie
Sandeep Reddy Vanga
Prabhas Spirit
Tripti Dimri
Bhushan Kumar
Pan India Movie
Telugu Cinema
Vivek Oberoi
Action Drama

More Telugu News