Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చిప్స్ అడిగిన చిన్నారి... వీడియో ఇదిగో!
- గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించిన కిచిడీ మేళాలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- ఆలయానికి వచ్చిన భక్తులతో ముచ్చటించిన యోగి ఆదిత్యనాథ్
- చిన్నారిని దగ్గరకు పిలిచి ఏం కావాలని అడిగిన ముఖ్యమంత్రి
- చిప్స్ కావాలని చిన్నారి అడగడంతో చిరునవ్వులు చిందించిన ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక చిన్నారి బాలుడితో సరదాగా ముచ్చటించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ బాలుడు తనకు చిప్స్ కావాలని అడగగా, ముఖ్యమంత్రి చిరునవ్వుతో స్పందించారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంప్రదాయం ప్రకారం గోరఖ్‌నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన భక్తులతో ఆయన కాసేపు మాట్లాడారు.
ఆ సమయంలో, ఒక చిన్నారిని ఆయన దగ్గరకు పిలుచుకుని ఏం కావాలో అడిగారు. ఆ బాలుడు ముఖ్యమంత్రి చెవిలో తనకు చిప్స్ కావాలని చెప్పాడు. ఆ చిన్నారి మాటలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు అక్కడున్న వారందరూ నవ్వారు.