Chandrababu Naidu: సొంతూరిలో సీఎం చంద్రబాబు కుటుంబం సంక్రాంతి వేడుకలు... ఫొటో రౌండప్ ఇదిగో!

Chandrababu Naidu Celebrates Sankranti in Native Village
  • నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు
  • కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ, కుల దేవతలకు ప్రత్యేక పూజలు
  • తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి
  • చంద్రబాబు నివాసంలో టీటీడీ పండితుల వేదాశీర్వచనాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత గ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఏటా సొంత గ్రామంలోనే పండుగ జరుపుకునే ఆనవాయతీని కొనసాగిస్తూ, గురువారం ఉదయం వేడుకల్లో పాల్గొన్నారు.

పండుగ సందర్భంగా, ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మొదట గ్రామదేవత దొడ్డి గంగమ్మ ఆలయాన్ని, ఆ తర్వాత తమ కులదేవత నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నివాసానికి విచ్చేసిన టీటీడీ వేద పండితులు చంద్రబాబు దంపతులకు, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించారు.

అనంతరం, చంద్రబాబు తన తల్లిదండ్రులైన దివంగత నారా అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్, నటుడు నారా రోహిత్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పండుగ వేడుకలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతికి తిరిగి రానున్నారు.
Chandrababu Naidu
Naravaripalle
Sankranti celebrations
Nara Lokesh
Brahmani Nara
Devansh Nara
Nara Rohit
Andhra Pradesh
Telugu Festivals
Family celebrations

More Telugu News