Vandanapu Muralikrishna: సంక్రాంతి స్పెషల్... తెనాలి అల్లుడికి 158 రకాలతో అసలు సిసలు విందు భోజనం

Vandanapu Muralikrishna hosts lavish feast for son in law in Tenali
  • రాజమండ్రికి చెందిన అల్లుడు శ్రీదత్తకు అపురూప గౌరవం
  • అల్లుడికి వ్యాపారి వందనపు మురళీకృష్ణ దంపతుల ఘన ఆతిథ్యం
  • గోదావరి సంప్రదాయాన్ని గుర్తుచేసేలా వేడుక
సంక్రాంతి పండుగ వేళ అల్లుళ్లకు ఇచ్చే మర్యాదల విషయంలో గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. కానీ ఈసారి గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం, గోదావరి ప్రాంతానికి చెందిన తమ అల్లుడికి ఏకంగా 158 రకాల వంటకాలతో విందు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. గోదావరి జిల్లాలకే ఏమాత్రం తీసిపోని రీతిలో తమ ప్రేమను, ఆప్యాయతను చాటుకుంది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శ్రీ వేంకటేశ్వర గ్యాస్ కంపెనీ యజమాని వందనపు మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను గత ఏడాదే రాజమండ్రికి చెందిన శ్రీదత్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి చిరస్మరణీయంగా ఉండిపోయేలా ఒక వేడుక చేయాలని మురళీకృష్ణ దంపతులు భావించారు.

ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం తమ అల్లుడి కోసం ఏకంగా 158 రకాల వంటకాలను సిద్ధం చేశారు. అరిసెలు, బూరెలు, గారెలు వంటి సంప్రదాయ పిండి వంటలతో పాటు వివిధ రకాల స్వీట్లు, పచ్చళ్లు, ఇతర పదార్థాలతో అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. గోదావరి ప్రాంతానికి చెందిన తమ అల్లుడికి, ఆ ప్రాంత సంప్రదాయానికి గౌరవం ఇచ్చేలా ఈ ఆతిథ్యం అందించడం విశేషం.
Vandanapu Muralikrishna
Tenali
Guntur district
Sankranti festival
Andhra Pradesh
Godavari districts
158 dishes
Son-in-law feast
Mounika
Sridath

More Telugu News