Vande Bharat Express: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల పెంపు

Vande Bharat Express Secunderabad Tirupati Train Coaches Increased
  • 16 నుంచి 20కి పెరిగిన బోగీల సంఖ్య
  • ప్రస్తుత సీట్ల సామర్థ్యం 1,440
  • ఆరెంజ్ రంగులోకి మారిన బోగీలు
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటోంది. దీంతో ఈ రైలు బోగీల సంఖ్యను పెంచారు. 

2023 ఏప్రిల్ 9న ఈ సర్వీసును ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని నెలల పాటు 8 బోగీలతో ఈ రైలు నడిచింది. ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండటంతో ఆ తర్వాత 16 బోగీలకు పెంచారు. తాజాగా డిమాండ్ మరింత పెరగడంతో బోగీల సంఖ్యను 20కి పెంచేశారు. ఈ రైలు సామర్థ్యం 1,440 సీట్లుగా ఉంది. మరోవైపు, ఈ రైలు బోగీలను పూర్తిగా ఆరెంజ్ కలర్ లోకి మార్చారు. గతంలో తెలుపు రంగులో ఉన్న ఈ రైలు ఇప్పుడు ఆరెంజ్ కలర్ లోకి మారిపోయింది.  
Vande Bharat Express
Secunderabad Tirupati Vande Bharat
Vande Bharat Train
Indian Railways
Orange Vande Bharat
Train Coaches Increased
increased coaches
railway demand

More Telugu News