Jagan Mohan Reddy: రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు ద్రోహం చేశారన్న జగన్.. తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి

Jagan Mohan Reddy Accusations Against Chandrababu Draw Strong Response
  • జగనే రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారన్న సోమిరెడ్డి
  • కేసీఆర్, జగన్‌లు ఇదివరకు సొంత అన్నదమ్ముల్లా ఉండేవారన్న టీడీపీ నేత
  • వైసీపీ హయాంలోని పాపాలను కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకు ఏపీ సీఎం చంద్రబాబు ద్రోహం చేశారని... చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. రాయలసీమ ప్రాంతానికి జగనే ద్రోహం చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఆయనకు సొంత తమ్ముడిలా ఉండేవారని, ఇద్దరి రక్తం ఒకటేనని విమర్శించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారో జగన్ గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. కేసీఆర్‌తో నాడు లాలూచీ పడిన జగన్ ఎన్జీటీ స్టే వెకేట్ వేయకుండా, ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించకుండా వదిలేశారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన పాపాలను జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల ఆలస్యంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నామని నోరు పారేసుకోవద్దని జగన్‌పై మండిపడ్డారు. ప్రాజెక్టుల అంశంలో తమ వైపు వేలెత్తి చూపించే హక్కు వైసీపీ నాయకులకు లేదని అన్నారు.
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Revanth Reddy
Somireddy Chandramohan Reddy
Rayalaseema

More Telugu News