Shashi Tharoor: ట్రంప్ అధిక సుంకాలు... స్పందించిన శశిథరూర్

Shashi Tharoor Responds to Trumps High Tariffs
  • ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
  • అధిక సుంకాల వల్ల భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందన్న శశిథరూర్
  • అమెరికాకు 75 శాతం సుంకాలు చెల్లించి ఎగుమతి చేయడం మన కంపెనీలకు సాధ్యం కాదని వెల్లడి
ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. అమెరికా విధిస్తోన్న సుంకాల వల్ల భారత్ ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ఏ భారతీయ కంపెనీ కూడా అమెరికాకు 75 శాతం సుంకాలు చెల్లించి ఎగుమతి చేయడం సాధ్యం కాదని అన్నారు.

భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. వివిధ కారణాలతో అమెరికా విధిస్తోన్న సుంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని శశిథరూర్ పేర్కొన్నారు. ఇప్పటికే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకాలు విధిస్తోందని, ఇప్పుడు ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25 శాతం సుంకాలు విధిస్తున్నారని విమర్శించారు.

ఇన్ని టారిఫ్‌లను తట్టుకుని 75 శాతం సుంకాలను చెల్లించి అమెరికాకు మన ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం విషయంలో ఆలస్యం చేయవద్దని శశిథరూర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని అన్నారు.
Shashi Tharoor
Donald Trump
US Tariffs
India US Trade
Iran
Sergio Gore
Indian Exports
Trade Agreement

More Telugu News