'దృశ్యం 3' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన మోహన్‌లాల్!
- 'దృశ్యం 3' విడుదల తేదీని ప్రకటించిన మోహన్‌లాల్
- ఏప్రిల్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి
- "సంవత్సరాలు గడిచాయి, గతం కాదు" అంటూ పోస్ట్
- హిందీ రీమేక్ కంటే ఆరు నెలల ముందే మాతృక విడుదల
సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సిరీస్ అభిమానులకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అదిరిపోయే శుభవార్త అందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో జార్జ్‌కుట్టి మూడోసారి ఎలాంటి మాయ చేయనున్నాడో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో మొదలైంది.
బుధవారం మోహన్‌లాల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక మోషన్ పోస్టర్‌ను పంచుకున్నారు. దానికి "సంవత్సరాలు గడిచాయి. గతం కాదు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో, ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి మరో కీలకమైన విషయం ఏమిటంటే, మలయాళ మాతృక విడుదలైన దాదాపు ఆరు నెలల తర్వాత హిందీ రీమేక్ రానుంది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ 'దృశ్యం 3' అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా రెండు వెర్షన్లు ఒకేసారి చిత్రీకరించి ఒకేరోజు విడుదల చేస్తుంటారు, కానీ ఈసారి మాతృకకు ఎక్కువ సమయం ఇవ్వడం గమనార్హం.
'దృశ్యం 3'లో మోహన్‌లాల్‌తో పాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ తమ పాత పాత్రల్లోనే కనిపించనున్నారు. గత రెండు భాగాల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి పన్నిన వ్యూహాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో భాగంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమిస్తాడో చూడాలని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.