Iran: అమెరికా దళాలకు సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్
- అమెరికా తమపై దాడికి ప్రయత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులు చేస్తామన్న ఇరాన్
- అమెరికా సైనిక చర్యలకు పొరగు దేశాలు ఏవైనా సహకరిస్తే ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా మిస్సైల్ దాడులు చేస్తామని వెల్లడి
- అమెరికా వెనక్కి తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న ఇరాన్
అమెరికా దళాలకు సహకరిస్తే దాడులు చేస్తామంటూ పొరుగు దేశాలకు ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న అమెరికాకు ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా తమపై దాడికి ప్రయత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాదు, అమెరికా సైనిక చర్యలకు పొరుగు దేశాలేమైనా సహకరిస్తే, ఆ దేశాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించింది.
ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో అమెరికా అత్యాధునిక డ్రోన్లతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. ఎప్పుడైనా ఇరాన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా వెనక్కి తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల వరకూ వెనిజువెలా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా, ఇప్పుడు తన వ్యూహాత్మక బలగాలను మళ్లీ గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఒమన్ గల్ఫ్‌తో పాటు ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా నిఘా చర్యలను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యలకు సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ - 4సీ ట్రైటాన్ డ్రోన్లు అబుదాబి కేంద్రంగా నిరంతర నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.