Dhurandhar Movie: బాహుబలి-2 రికార్డును అధిగమించిన ధురంధర్

Dhurandhar Movie Breaks Baahubali 2 Record
  • నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కొత్త చరిత్ర సృష్టించిన ధురంధర్ 
  • ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్న ధురంధర్ 
  • నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి బాహుబలి -2 రికార్డును బ్రేక్ చేసిన ధురంధర్
రికార్డులు బద్దలు కొట్టడానికే అన్నట్లుగా ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న ఈ చిత్రం, తాజాగా మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ధురంధర్ నూతన చరిత్ర సృష్టించింది.

ఇంతవరకు ఈ ఘనత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా నటించిన బాహుబలి - 2 పేరిట ఉండేది. ఆ చిత్రం ఉత్తర అమెరికాలో 20.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించగా, గత తొమ్మిదేళ్లుగా ఈ రికార్డును ఏ చిత్రం కూడా అధిగమించలేకపోయింది. అయితే ఇప్పుడు ధురంధర్ చిత్రం 21 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.

భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ఇదివరకే గుర్తింపు పొందిన ధురంధర్, ఇప్పుడు యూఎస్ మార్కెట్‌లోనూ అగ్రస్థానానికి చేరింది. ఈ జాబితాలో ధురంధర్ తర్వాత బాహుబలి -2 (20.7 మిలియన్ డాలర్లు), కల్కి: 2898 ఏడీ (18.5 మిలియన్ డాలర్లు), పఠాన్ (17.5 మిలియన్ డాలర్లు), జవాన్ (15.6 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా మార్కెట్‌లోనూ ధురంధర్ అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 
Dhurandhar Movie
Dhurandhar
Baahubali 2
SS Rajamouli
Prabhas
North America Box Office
Indian Cinema
Highest Grossing Indian Films
Kalki 2898 AD
Pathaan
Jawan

More Telugu News