DK Shivakumar: రాహుల్ గాంధీ పర్యటన అనంతరం.. డి.కె. శివకుమార్ ఆసక్తికర పోస్టు

DK Shivakumars intriguing post during Rahul Gandhis visit
  • మంగళవారం నాడు మైసూరులో పర్యటించిన రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీ పర్యటన వేళ మరోసారి చర్చనీయాంశంగా మారిన సీఎం మార్పు అంశం
  • ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావంటూ శివకుమార్ పోస్టు
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం గత కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. "ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావు" అంటూ ఆయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాహుల్ గాంధీ మంగళవారం మైసూరులో పర్యటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తదితర ముఖ్య నేతలతో ఆయన కొంతసేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికార పంపిణీ వ్యవహారంపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అధికార మార్పిడి అంశంపై స్పష్టతనివ్వాలని సిద్ధరామయ్య కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివకుమార్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
DK Shivakumar
Rahul Gandhi
Karnataka
Siddaramaiah
Karnataka Politics
Congress Party
Chief Minister

More Telugu News