Ravi Shankar Prasad: కేంద్రమంత్రి నివాసంలో అగ్నిప్రమాదం

Fire Accident at Union Minister Ravi Shankar Prasad Residence
  • ఢిల్లీలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికార నివాసంలో ఘటన
  • ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం
  • వెంటనే స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక శాఖ సిబ్బంది
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని మదర్ థెరిస్సా క్రీసెంట్ రోడ్డులోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని సమచారం.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లోనే ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. మంత్రి నివాసంలోని ఒక గదిలో మంటలు ఎగిసిపడ్డాయని ఫోన్ రావడంతో మూడు ఫైరింజన్లతో వెళ్లి మంటలు ఆర్పామని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
Ravi Shankar Prasad
Ravi Shankar Prasad fire accident
Delhi fire
Union Minister
Fire at residence
Mother Teresa Crescent Road
Fire Department
Fire in Delhi
Accident

More Telugu News