కేంద్ర మంత్రి నివాసంలో పొంగల్ వండిన ప్రధాని నరేంద్ర మోదీ
- కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు
- ప్రపంచవ్యాప్తంగా తమిళులకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర రైతులను, తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. పొంగల్ పండుగ తమిళుల గొప్ప సంప్రదాయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. "ప్రియమైన భారతీయులారా, వణక్కం. పొంగల్ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.