Bandi Sanjay: ఈ పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల ఉపాధి దొరుకుతుంది: బండి సంజయ్

Bandi Sanjay Says VB Jeeram Jee Scheme Provides 200 Days of Employment
  • ఈ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందన్న బండి సంజయ్
  • తెలంగాణ రాష్ట్రంలో రూ.340 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడి
  • రైతులకు న్యాయం చేసేలా ఈ పథకం తెచ్చినట్లు వెల్లడి
'వీబీ జీరామ్ జీ' పథకం ద్వారా ఉపాధి కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు లభిస్తాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం స్థానంలో 'వీబీ జీ రామ్ జీ'ని ప్రవేశపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు. ఈ పథకం ద్వారా ఉపాధి హామీ కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే ఈ పథకానికి అదనంగా రూ.17 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలుకు అదనంగా రూ.340 కోట్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు న్యాయం చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్‌లో ఈ పథకం పనులు జరగవని, దీనివల్ల కూలీలు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.
Bandi Sanjay
VB Jeeram Jee
NREGA
Employment Guarantee Scheme
Telangana
Rural Employment

More Telugu News