Chandrababu Naidu: తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
- భోగి మంటలు ప్రతి కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్ష
- ప్రజల ఆశయాల సాధనకు అండగా ఉంటానని హామీ
- అందరి జీవితాలు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు వెల్లడి
రేపు భోగి పండుగ (జనవరి 14) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ముగ్గులతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్న వేళ, ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ఆయన మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. "దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రజల ఆశావహ దృక్పథంతో కూడిన ఆలోచనలు సాకారం కావాలి. అందుకు నేను మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ మరోమారు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన తన సందేశంలో వివరించారు.