Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు... తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ఈసీ

Telangana Municipal Elections Final Voter List Released by EC
  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడి
  • నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధిక ఓటర్లు
  • కొత్తగూడెంలో అత్యల్పంగా 1,34,774 మంది ఓటర్లు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా, కొత్తగూడెంలో అత్యల్పంగా 1,34,774 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా, అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Telangana Municipal Elections
Telangana Elections
Municipal Elections
State Election Commission

More Telugu News