'అనగనగా ఒక రాజు'లో ఆ లైన్ ను టచ్ చేశారట!

Anaganaga Oka Raju Movie Update
  • నవీన్ పోలిశెట్టి నుంచి 'అనగనగ ఒక రాజు'
  • రేపు విడుదలవుతున్న సినిమా  
  • నాయిక పాత్రలో అలరించే మీనాక్షి 
  • పొలిటికల్ టచ్ ఉంటుందన్న నాగవంశీ
  • హాస్యమే ప్రధానమైన ఆయుధం 
 
 సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు .. పల్లెల్లో సందడి పెరుగుతూ పోతుంటుంది. ఇక పట్నాల్లో సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే సంక్రాంతిని సినిమాల పండుగగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఈ సంక్రాంతికి ఇప్పటికే 'రాజా సాబ్' .. 'మన శంకర వరప్రసాద్ గారు' .. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలు థియేటర్లకు వచ్చాయి. ఇక రేపు 'అనగనగా ఒక రాజు' సినిమా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమాతో దర్శకుడిగా 'మారి' పరిచయమవుతున్నాడు. నవీన్ పోలిశెట్టి - మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో రావు రమేశ్ కనిపించనున్నాడు. నవీన్ పోలిశెట్టికి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, కథల విషయంలో  .. పాత్రల విషయంలో చాలా కేర్ తీసుకుని మరీ ఎంచుకుంటున్నాడు. అందువలన ఈ కథలో విషయం కాస్త గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. నవీన్ కామెడీ .. మీనాక్షి గ్లామర్ .. రావు రమేశ్ విలక్షణ నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. 

ఇంతవరకూ ఈ సినిమాలో కామెడీనే ప్రధానమైన అంశంగా భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా జరిగిన ఒక ఈవెంటులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని చెప్పారు. పొలిటికల్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ, వీలైనంత వినోదాన్ని అందిస్తుందని అన్నారు. మొత్తానికి సంక్రాంతికి అవసరమైన అన్ని రకాల వినోదపరమైన అంశాలను కలుపుకుని వస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో అలరిస్తుందనేది చూడాలి. 

Go Back to Shorts
Anaganaga Oka Raju
Naveen Polishetty
Meenakshi Chaudhary
Sankranti Movies
Telugu Cinema Release
Rao Ramesh
Naga Vamsi
Political Comedy
Telugu Movie Review

More Telugu News