Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం

Etela Rajender and Marri Rajasekhar Reddy Engage in Heated Argument
  • మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో వాగ్వాదం
  • వంతెన నిధులు తెచ్చింది తామంటే తామేనంటూ ఇరువురు నేతల వాగ్వాదం
  • పోలీసుల జోక్యంతో శాంతించిన ఇరువర్గాలు
బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, బీఆర్ఎస్ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వంతెన నిర్మాణానికి నిధులు తెచ్చింది తామంటే తామేనని ఇరువురు నేతలు వాదోపవాదనలకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. మర్రి రాజశేఖర్ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Etela Rajender
Marri Rajasekhar Reddy
Malkajgiri MP
BRS MLA
Medchal District
Railway Under Bridge

More Telugu News