: ప్రయాగ్ రాజ్ లో మాఘ మేళాలో ప్రసాదాల తయారీకి లేటెస్ట్ మెషిన్

  • శ్రీ ప్రయాగ్వాల్ క్యాంపులో నిత్యాన్నదానం
  • వేలాది మంది భక్తులకు వండి వడ్డిస్తున్న సిబ్బంది
  • అన్న ప్రసాదాలను వేగంగా తయారు చేయడానికి భారీ యంత్రాలు
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మాఘ మేళాలో నిత్యం లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. పవిత్ర నదీ స్నానం చేసి పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీ నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తుల ఆకలి తీర్చడానికి పలుచోట్ల ఎన్జీవో, ఆధ్యాత్మిక సంస్థలు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నాయి. శ్రీ ప్రయాగ్వాల్ క్యాంప్ లో భక్తులకు నిత్యం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. వేలాదిమంది భక్తులకు అన్నదానం కోసం రోజంతా వడ్డనలు కొనసాగుతున్నాయి. వేగంగా వండివార్చేందుకు ఈ క్యాంప్ లో భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అత్యాధునిక యంత్రాలతో అన్న ప్రసాదాలను తయారుచేసి భక్తుల ఆకలిని తీర్చుతున్నారు.

ఈ సందర్భంగా శ్రీ ప్రయాగ్వాల్ సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ మాట్లాడుతూ.. మాఘమేళాకు వచ్చే భక్తులు ఆకలితో అలమటించే పరిస్థితి ఎదురుకాకూడదని అన్నారు. ఇందుకోసం తమ సంస్థ కిచెన్ లో రోజంతా వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆధునిక యంత్రాల సాయంతో రొట్టెలను తయారుచేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తున్నట్లు తెలిపారు. పిండి కలపడం నుంచి రొట్టెలను కాల్చడం దాకా మొత్తం ఈ యంత్రమే చేస్తుందని, దీనివల్లే నిత్యం వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం అందజేస్తున్నామని ఆయన వివరించారు.

More Telugu News