Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' లో చిరంజీవి హుక్ స్టెప్ వెనుక ఉన్న కథ ఇదే!

Chiranjeevi Manam Shankaravaraprasadam Hook Step Song Story Revealed
  • పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో ఈఎంఐ గుర్తు చేస్తూ వరుసగా ఫోన్లు రావడం చిరాకు తెప్పించిందన్న కొరియోగ్రాఫర్ ఆట సందీప్
  • సెల్ ఫోన్ పగలకొట్టేద్దామనుకున్న సమయంలో ఓ ఐడియా తట్టిందన్న సందీప్
  • లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, కేవలం సెల్ ఫోన్ లైట్ వేసుకుని హుక్ స్టెప్ కంపోజ్ చేశామన్న సందీప్
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే అభిమానులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే, 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంలో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన 'హుక్ స్టెప్ సాంగ్' వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉందని కొరియోగ్రాఫర్ ఆట సందీప్ వెల్లడించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో విడుదలైంది.

ఈ చిత్రంలో చిరంజీవి చేసిన డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'హుక్ స్టెప్ సాంగ్‌'కు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ స్టెప్ ఇంతగా క్లిక్ కావడానికి కారణమైన ఆసక్తికర అంశాన్ని కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా పంచుకున్నారు.

థియేటర్‌లో సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన అందరికీ ఏదో ఒక సమస్యలు ఉంటాయని, అదే విధంగా తనకు ప్రతి నెల ఈఎంఐలు కట్టే సమస్య ఉందని అన్నారు. ఈ పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో ఈఎంఐ గుర్తు చేస్తూ వరుసగా ఫోన్లు రావడం తనకు చిరాకు తెప్పించిందన్నారు.

సాధారణంగా తాను కంపోజింగ్ సమయంలో ఫోన్ తీసుకువెళ్లనని, అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుందని చెప్పడంతో సెల్ తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. లోపలికి వెళ్ళాక కూడా ఫోన్లు వస్తుండటంతో కోపంతో సెల్ ఫోన్ పగలకొట్టేద్దామనుకున్నానని, అయితే అదే సమయంలో ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఒక ఆలోచన వచ్చిందన్నారు.

వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, కేవలం సెల్ ఫోన్ లైట్ వేసుకుని హుక్ స్టెప్ కంపోజ్ చేశానని, అది చూసి నా భార్య కూడా చప్పట్లు కొట్టడంతో ఆ స్టెప్‌ను ఇంకాస్త డెవలప్ చేసి, ఇప్పుడు మీరు సినిమాలో చూస్తున్న విధంగా ఫైనల్ చేశామన్నారు. చిరంజీవి గ్రేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ స్టెప్ డిజైన్ చేశానని సందీప్ వివరించారు. 
Chiranjeevi
Manam Shankaravaraprasadam
Hook Step Song
Aata Sandeep
Anil Ravipudi
Nayanthara
Venkatesh Daggubati
Telugu Movie Dance
EMI Problem
Chiranjeevi Dance

More Telugu News