సంక్రాంతి ముంగిట.. ఏపీలో మద్యం ధరల పెంపు!

  • ఏపీలో కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10ల ధర పెంపు చేస్తూ ఉత్తర్వులు
  • రూ.99 (180 ఎంఎల్) ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్,  బీర్, వైన్, ఆర్‌టీడీలను ఈ పెంపు నుంచి మినహాయించినట్లు పేర్కొన్న ఎక్సైజ్ శాఖ
  • బార్లపై విధిస్తున్న అదనపు ఏఆర్‌ఈటీను తొలగించేందుకు అంగీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ
సంక్రాంతి పండుగకు కొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కొన్ని రకాల మద్యం బాటిళ్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 ధర పెంచుతూ నిన్న ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని సైజుల బాటిళ్లపై ఈ ధర పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే రూ.99 (180 ఎంఎల్) ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బీర్, వైన్, ఆర్‌టీడీలను ఈ పెంపు నుంచి మినహాయించినట్లు తెలిపింది.

అదే విధంగా బార్లపై విధిస్తున్న అదనపు ఏఆర్‌ఈటీని తొలగించేందుకు అంగీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్లు, షాపుల మధ్య ధరల సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రిటైలర్ మార్జిన్‌ను సుమారు ఒక శాతం పెంచుతున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక ఐఎంఎఫ్ఎల్, ఎఫ్‌ఎల్, బీర్, వైన్ షాపులకు మార్జిన్ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 


More Telugu News