Konaseema: సంక్రాంతికి ‘హెలికాప్టర్’ రైడ్: రూ. 5 వేలకే కోనసీమ అందాలు!

Konaseema Helicopter Ride Offer at Rs 5000 for Sankranti
    
ఈ సంక్రాంతి పండుగను మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వారికి ఒక అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. గోదావరి జిల్లాల ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించేలా హైదరాబాద్‌కు చెందిన 'విహాగ్‌' సంస్థ నరసాపురంలో హెలికాప్టర్ రైడ్‌ను ఏర్పాటు చేస్తోంది. పండుగ మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక విమాన విహారం అందుబాటులో ఉంటుంది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఈ హెలికాప్టర్ రైడ్ ప్రారంభం కానుంది. ఈ ప్రయాణంలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం, విశాలమైన సాగర తీరం, లైట్ హౌస్, గోదావరి పాయలు కలిసే అన్న చెల్లెళ్ల గట్టుతో పాటు కోనసీమ జిల్లాలోని పచ్చని కొబ్బరి తోటల అందాలను ఆకాశం నుంచి తిలకించవచ్చు.

ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరను రూ. 5,000గా నిర్ణయించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగే ఈ గగన విహారంలో 25 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. పండుగ సందడికి ఈ హెలికాప్టర్ రైడ్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. 
Konaseema
Sankranti
Helicopter ride
Andhra Pradesh tourism
Godavari districts
Antarvedi temple
Narsapuram
Vihaag
Tourism
Festival offer

More Telugu News