Chiranjeevi: చిరంజీవిపై అల్లు అరవింద్ ప్రశంసలు

Chiranjeevi Praised by Allu Aravind for Vintage Mass Magic
  • మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో చిరంజీవి నటన, డ్యాన్స్‌ చించేశాడన్న అల్లు అరవింద్
  • సినిమా మొత్తం ఎక్సలెంట్‌గా ఉందని వ్యాఖ్య
  • ఓల్డ్ రౌడీ అల్లుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన మధురానుభూతి మళ్లీ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగిందన్న అరవింద్
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వింటేజ్ మాస్ మ్యాజిక్‌తో ప్రేక్షకులను అలరించారు. 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా చూసిన తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ‘బాస్ ఈజ్ బాస్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న థియేటర్‌లలో విడుదలైంది. 

చిరంజీవి ఈ చిత్రంలో పూర్తి వింటేజ్ లుక్‌తో, కామెడీ టైమింగ్‌, మాస్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ చూసిన అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. చిరంజీవి నటన, డ్యాన్స్‌పై అరవింద్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘బాస్ ఈజ్ బాస్.. చించేశాడు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఓల్డ్ రౌడీ అల్లుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన మధురానుభూతి మళ్లీ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగిందన్నారు. అలాగే వెంకటేష్ ఎంట్రీ, చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయిందని తెలిపారు. సినిమా మొత్తం ఎక్సలెంట్‌గా ఉందని, ప్రేక్షకులకు పూర్తి పైసా వసూల్ ఫీలింగ్ ఇస్తుందని అన్నారు. మొత్తానికి ఈ మూవీతో మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటారని అల్లు అరవింద్ పేర్కొన్నారు. 
Chiranjeevi
Allu Aravind
Mana Shankara Vara Prasad Garu
Anil Ravipudi
Nayanatara
Venkatesh Daggubati
Telugu Movie
Tollywood
Mass Movie
Sankranti

More Telugu News