Gunda Appala Suryanarayana: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కన్నుమూత... సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందన

Gunda Appala Suryanarayana Former Minister Passes Away Chandrababu Lokesh Condolences
  • టీడీపీలో విషాదం... మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కన్నుమూత
  • చంద్రబాబు, లోకేశ్ ప్రగాఢ సంతాపం
  • టీడీపీకి తీరని లోటన్న చంద్రబాబు
  • అజాత శత్రువును కోల్పోయామన్న నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మరణించారు. ఆయన మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపం తెలిపారు.

గుండ అప్పలసూర్యనారాయణ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. "ఆయన వరుసగా నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. క్రమశిక్షణ, పార్టీ పట్ల అంకితభావంతో ఆయన చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ కూడా తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. "రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచిన గుండ అప్పల సూర్యనారాయణ గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. తెలుగుదేశం పార్టీకి వారు లేని లోటు తీరనిది. ముక్కుసూటి, నిజాయతీకి మారుపేరైన ఆయన నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. వారి సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను" అని లోకేశ్ అన్నారు. గుండ అప్పలసూర్యనారాయణ మృతితో శ్రీకాకుళం జిల్లా టీడీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Gunda Appala Suryanarayana
Gunda Appala Suryanarayana death
Chandrababu Naidu
Nara Lokesh
TDP leader
Srikakulam
Andhra Pradesh politics
Telugu Desam Party
Ex Minister
Political News

More Telugu News