Telangana Government: తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ సంక్రాంతి కానుక.. డీఏ పెంపు ఉత్తర్వులు జారీ
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (డీఏ) పెంపు
- 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏ పెంపుదల
- 2023 జులై 1వ తేదీ నుంచి పెంచిన డీఏ వర్తింపు
- ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- జనవరి 2026 జీతంతో కలిపి కొత్త డీఏ చెల్లింపునకు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సంక్రాంతి కానుక ప్రకటించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లక్షలాది మందికి ఆర్థిక ఉపశమనం కల్పిస్తూ, కరవు భత్యం (డీఏ) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏను 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపు 2023 జులై 1వ తేదీ నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జనవరి 12న జీవో నెం.2ను జారీ చేసింది.
గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు "సంక్రాంతి కానుక"గా అభివర్ణించారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO) 2026 డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డీఏ మంజూరు ఫైల్‌పై సోమవారం సంతకం చేశాను" అని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సకాలంలో జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
వివిధ కేటగిరీల ఉద్యోగులకు వర్తింపు
తాజా ఉత్తర్వుల ప్రకారం, 2020 రివైజ్డ్ పే స్కేల్స్ (ఆర్‌పీఎస్) కింద వేతనాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. వీరితో పాటు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా ఎయిడెడ్ సంస్థలు, పాలిటెక్నిక్‌లు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఈ పెంపు వర్తింపజేశారు.
ఇతర పే స్కేల్స్ ఉద్యోగులకూ ఊరట
2015 ఆర్‌పీఎస్: ఈ స్కేల్స్‌లో వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు డీఏను 68.628 శాతం నుంచి 73.344 శాతానికి పెంచారు.
యూజీసీ/ఏఐసీటీఈ 2016 స్కేల్స్: ఈ స్కేల్స్‌లో ఉన్న వారికి డీఏను 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు.
యూజీసీ/ఏఐసీటీఈ 2006 స్కేల్స్: ఈ కేటగిరీ ఉద్యోగులకు డీఏ 221 శాతం నుంచి 230 శాతానికి పెరిగింది.
ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు: వీరికి 7.704 శాతం డీఏను సవరించారు. దీంతో వీరి మొత్తం డీఏ 171.18 శాతానికి చేరింది.
పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు/వీఆర్ఏలు: వీరిని ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే వరకు నెలకు రూ.100 అదనపు భత్యం మంజూరు చేశారు.
బకాయిల చెల్లింపు ఇలా..
పెంచిన డీఏను 2026 జనవరి నెల జీతంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు పేరుకుపోయిన బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల విషయంలో, బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాన్ (PRAN) ఖాతాలకు, ప్రభుత్వ వాటాతో కలిపి జమ చేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 30 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు. ఏప్రిల్ 30, 2026లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు, జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు కూడా బకాయిలను 30 వాయిదాలలో చెల్లించనున్నారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు, అంతే సంఖ్యలో ఉన్న పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
రైతులకు గుడ్ న్యూస్
సంక్రాంతి వేళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు కూడా శుభవార్తను అందించింది. సన్న వరిధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నరకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ సీజన్‌లో ప్రభుత్వం మొత్తం రూ.1,429 కోట్ల బోనస్ నిధులను విడుదల చేసింది. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని, మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నారు.