Sridhar Babu: ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై ప్రచారం సరికాదు: శ్రీధర్ బాబు

Sridhar Babu Responds to Defamation of Ministers AIS Officers in Media
  • ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు
  • నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం సరికాదన్న మంత్రి
  • రాజకీయ వైరుధ్యాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలన్న మంత్రి
ప్రభుత్వంలోని పెద్దలు, ఐఏఎస్ అధికారులపై కొన్ని రోజుల కిందట మీడియాలో జరిగిన ప్రచారం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మంత్రి మీడియాతో అన్నారు. ఇది మంచి సంస్కృతి కాదని, ఇలాంటి ప్రచారాలను దయచేసి ప్రోత్సహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య కథనాలను ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ సమయంలో విషపూరిత ప్రచారం చేయడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. కానీ అబద్ధపు ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఒక ప్రధాన టీవీ ఛానల్‌లో ఈ ప్రచారం జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Sridhar Babu
Telangana
Komati Reddy Venkat Reddy
AIS officers
defamation
false news
Telangana ministers
political criticism
media ethics

More Telugu News