Ravi Teja: సంక్రాంతికి రొమాంటిక్ టచ్ ఇస్తున్న రవితేజ!

Bharta Mahashayulaku Vignapti Movie Update
  • రేపు విడుదలవుతున్న రవితేజ మూవీ 
  • హీరోయిన్స్ గా ఆషిక - డింపుల్ హయతి
  • దర్శకుడిగా కిశోర్ తిరుమల 
  • కామెడీ టచ్ తో సాగే రొమాంటిక్ మూవీ

రవితేజ తన సినిమాల విషయంలో ఎంత మాత్రం గ్యాప్ రానీయడు. అనుకోకుండా ఒక్కోసారి లెక్క తప్పడం వలన, ప్రాజెక్టులు ఆలస్యమవుతూ ఉంటాయే తప్ప, తానుగా ఆలస్యం చేయడమనేది తనకి ఎంతమాత్రం అలవాటు లేని పని. నాన్చడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అందువల్లనే ఆయన నుంచి చకచకా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమానే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. 

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికలుగా ఆషికా రంగనాథ్ - డింపుల్ హయతి అలరించనున్నారు. ఈ ఇద్దరితో కలిసి రవితేజ చేసే రొమాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా కామెడీ టచ్ తో నడుస్తుందని అంటున్నారు. డింపుల్ కి ఉన్న హాట్ ఇమేజ్ .. ఆషికకి గల ఫాలోయింగ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ల ద్వారా మంచి మార్కులు కొట్టేసిన కిశోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. 

'నా సామిరంగ' సినిమాలో నాగార్జున సరసన గ్లామర్ పరంగా సందడి చేసిన ఆషికా రంగనాథ్ ఆ తరువాత చేసిన సినిమా ఇది. భార్యకీ .. ప్రియురాలికి మధ్యలో నలిగిపోయే పాత్రలో రవితేజ నటన, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అంటున్నారు. సంక్రాంతి సినిమా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నారు. చూడాలి మరి ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో.

Ravi Teja
Bharta Mahashayulaku Vignapti
Ashika Ranganath
Dimple Hayathi
Sudhakar Cherukuri
Kishore Tirumala
Telugu Movie
Sankranthi Release
Naa Saami Ranga
Family Entertainer

More Telugu News