Abbas Araghchi: దేశంలోని పరిస్థితులపై స్పందించిన ఇరాన్ మంత్రి అబ్బాస్

Abbas Araghchi Responds to Iran Situation Says Under Control
  • నిరసనలతో అట్టుడుకుతోన్న ఇరాన్
  • దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్న మంత్రి
  • ఈ నిరసనలతో ట్రంప్ జోక్యం చేసుకోవడానికి సాకు దొరికిందని వ్యాఖ్య
తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోన్న విషయం విదితమే. ఆందోళనకారులను సైన్యం తీవ్రంగా అణిచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఈ ఘర్షణల్లో వందలాది మంది మృతి చెందారు. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేలాదిమందిని సైన్యం అరెస్టు చేసింది.

ఈ నేపథ్యంలో ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని టెహ్రాన్‌లో విదేశీ దౌత్యవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని స్పష్టం చేశారు. ఆందోళనకారుల నిరసనలతో తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ట్రంప్‌నకు ఒక సాకు దొరికిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఆందోళనకారులను ఉగ్రవాదులతో పోల్చారు. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆర్థిక సంక్షోభంలో ఇరాన్ కూరుకుపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలకు దిగారు. భద్రతాదళాలు వారిపై దాడులు చేయడంతో 500 మందికి పైగా మృతి చెందారు.
Abbas Araghchi
Iran protests
Iran unrest
Tehran
Masoud
Iran crisis
US Iran relations
Israel

More Telugu News