Pawan Kalyan: తొలి తెలుగు సమురాయ్... పవన్ కల్యాణ్ 30 ఏళ్ల మార్షల్ ఆర్ట్స్ ప్రస్థానంపై స్పెషల్ వీడియో

Pawan Kalyan First Telugu Samurai Special Video on 30 Years of Martial Arts Journey
  • 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' గౌరవం పొందిన జనసేనాని
  • పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ వీడియో విడుదల
  • యుద్ధ విద్యల సాధన, సినిమా ఫైట్ సీక్వెన్స్‌లతో కూడిన వీడియో
  • 'ఆంధ్రా తొలి సమురాయ్'గా పవన్‌ను అభివర్ణించిన క్రియేటివ్ వర్క్స్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 30 ఏళ్ల మార్షల్ ఆర్ట్స్ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ఒక ప్రత్యేక వీడియోను ఆయన నిర్మాణ సంస్థ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' విడుదల చేసింది. యుద్ధ విద్యల పట్ల పవన్ కల్యాణ్‌కున్న నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయతీ ఆయన్ను 'ఆంధ్రప్రదేశ్ తొలి సమురాయ్'గా నిలబెట్టాయని ఈ వీడియోకు క్యాప్షన్ జోడించారు. 

పవన్ కల్యాణ్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ గౌరవం లభించిన సంగతి తెలిసిందే. జపాన్ ప్రాచీన యుద్ధ కళ (కత్తి సాము)లో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది. 30 ఏళ్ల సాధనకు ఫలితంగా ఆయనకు ఈ అపురూపమైన ఘనత లభించింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోను పంచుకుంది. ఇందులో పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రస్థానాన్ని చూపించారు. 

యుద్ధ విద్యల సాధన, తాను నటించిన పలు చిత్రాల్లోని ఫైట్ సీక్వెన్స్ లు, అందులో ఉపయోగించిన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను ఈ వీడియోలో పొందుపరిచారు. పవన్ కల్యాణ్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. 





Pawan Kalyan
Pawan Kalyan martial arts
AP Deputy CM
Tiger of martial arts
martial arts training
Japanese sword fighting
Pawan Kalyan Creative Works
Tollywood
Janasena
Andhra Pradesh

More Telugu News