Roja: రోజా, అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాలు

Roja Ambati Rambabu Celebrate Sankranti in Guntur
  • గుంటూరులో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకలు 
  • వేడుకల్లో పాల్గొన్న రోజా
  • ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నాన్న రాంబాబు
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వైసీపీ నేతలు, మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు కూడా వేడుకల్లో సందడి చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు సంక్రాంతి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో రోజా కూడా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో మొదటి విజేతకు రూ. లక్ష, రెండో విజేతకు రూ. 50 వేల చొప్పున బహుమతులు అందజేశారు. 

అనంతరం రోజా, అంబటి బరిలోకి కోడి పుంజులను వదిలారు. ఈ కార్యక్రమాన్ని అక్కడున్న వారంతా ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ... ప్రతి ఏటా తాను సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. గతంలో సత్తెనపల్లిలో పోటీలను నిర్వహించానని చెప్పారు. రోజా మాట్లాడుతూ... "రాంబాబు అంటే సంక్రాంతి... సంక్రాంతి అంటే రాంబాబు" అని కితాబునిచ్చారు.
Roja
Ambati Rambabu
Sankranti Celebrations
Andhra Pradesh
Guntur
Cock Fights
Muggula Potilu
YSRCP Leaders
Satthenapalli

More Telugu News