Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్

Donald Trump Declares Himself President of Venezuela
  • ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టిన అమెరికా అధ్యక్షుడు
  • వికీపీడియాను పోలిన ఎడిటెడ్ ఫొటోను షేర్ చేసిన ట్రంప్
  • ఈ ఏడాది జనవరి నుంచి బాధ్యతలు చేపట్టినట్లు చూపుతున్న ఫొటో
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బలగాలు బలవంతంగా అరెస్ట్ చేసి ఫ్లోరిడాకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని వెనెజువెలా రక్షణమంత్రి వెల్లడించారు. 

ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలా అధ్యక్షుడిని తానేనని ట్రూత్ సోషల్ లో ఓ పోస్టు పెట్టారు. వికీపీడియాను పోలిన ఎడిటెడ్ ఫొటోను ఆయన పంచుకున్నారు. ఈ ఫొటోలో డొనాల్డ్ ట్రంప్ ను వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చూపించారు. ట్రంప్‌ ఫొటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లుగా ఉంది.

మచాడోకు ప్రజల మద్దతు లేదు..
మదురో అరెస్టు తర్వాత వెనెజువెలా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. వెనెజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మచాడోకు ట్రంప్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే, మచాడోకు ప్రజల మద్దతులేదని, ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా ప్రకటన సంచలనంగా మారింది.

Donald Trump
Venezuela
Nicolas Maduro
Delcy Rodriguez
US Elections
Venezuela President
Maria Corina Machado
Truth Social
Venezuela Politics
US Foreign Policy

More Telugu News