Ghattamaneni Jayakrishna: నేను ఒక్క సినిమా చేయకపోయినా అబిమానిస్తున్నారంటే అది ఆయన వల్లే: ఘట్టమనేని జయకృష్ణ

Ghattamaneni Jayakrishna Credits Grandfather Krishna for Support
  • విజయవాడ లెనిన్ సెంటర్‌లో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జయకృష్ణ
  • తాత కృష్ణ గర్వపడేలా ఉండటమే నా జీవిత లక్ష్యమన్న ఘట్టమనేని జయకృష్ణ
  • బాబాయి మహేశ్ బాబుకు వీరాభిమానినన్న జయకృష్ణ
నేను ఒక్క సినిమా చేయకపోయినా నన్ను అభిమానిస్తున్నారంటే అది తాత కృష్ణ గారి చలవేనని ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ అన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని పద్మాలయ సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, జయకృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జయకృష్ణ మాట్లాడుతూ నేను ఏమి చేసినా ఆయన (తాతయ్య) నా పక్కన ఉండి నడిపిస్తున్నారని అనిపిస్తుందన్నారు. ఆయన గర్వపడేలా ఉండటమే నా జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయి మహేశ్ బాబు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనకు తాను వీరాభిమానినని చెప్పుకున్నారు. ఆయన నా మొదటి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారన్నారు.

40 ఏళ్ల క్రితం కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమాను నిర్మాత అశ్వనీదత్ నిర్మించారని, ఆ తర్వాత 1999లో మహేశ్ బాబును ఆయనే లాంచ్ చేశారని, ఇప్పుడు ఆయన నన్ను నమ్మి లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తాను హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస్ మంగాపురం' చిత్రం తెరకెక్కుతున్నట్లు జయకృష్ణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. 
Ghattamaneni Jayakrishna
Krishna
Mahesh Babu
Ashwini Dutt
Ajay Bhupathi
Srinivas Mangapuram
Vijayawada
Telugu cinema
Padmalaya Studios
Raghurama Krishnam Raju

More Telugu News