South Central Railway: సంక్రాంతి రద్దీ: చర్లపల్లి-అనకాపల్లి మధ్య మరో 3 ప్రత్యేక రైళ్లు

South Central Railway Announces Special Trains Between Charlapalli and Anakapalle for Sankranti
  • హైదరాబాద్‌లోని చర్లపల్లి - అనకాపల్లి మధ్య కొత్త సర్వీసులు
  • ఇప్పటికే 170కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ
  • సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • సికింద్రాబాద్‌లో తాత్కాలికంగా పార్కింగ్ నిలిపివేత
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఆదివారం వెల్లడించింది.

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రైలు నంబర్ 07479 అనకాపల్లి-చర్లపల్లి ప్రత్యేక రైలు జనవరి 18న రాత్రి 10:30 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07477 చర్లపల్లి-అనకాపల్లి సర్వీసు జనవరి 19న అర్ధరాత్రి 12:40 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. ఇక మూడో రైలు (07478) జనవరి 19న రాత్రి 10:30 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30కి చర్లపల్లికి వస్తుంది.

ఇప్పటికే సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 4, హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం మీద విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, నరసాపురం వంటి ఏపీలోని కీలక ప్రాంతాలకు 170కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరో 130 ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తాయి.

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్లలో రైల్వే శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌లో రోజుకు సగటున 2.20 లక్షల మంది ప్రయాణికులు వస్తారని అంచనా. దీంతో అదనపు టీటీఈలు, ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. 24 గంటల పాటు పనిచేసే సీసీటీవీ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు ఉన్న బోయిగూడ ప్రవేశ ద్వారం వద్ద యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు.
South Central Railway
Sankranti
special trains
Charlapalli
Anakapalle
Hyderabad
Vijayawada
AP
railway
Indian Railways

More Telugu News