Chiranjeevi: చిరంజీవి సినిమాకు కోర్టు రక్షణ.. స్పందించిన విజయ్ దేవరకొండ
- చిరంజీవి సినిమాపై నెగెటివ్ ప్రచారాన్ని అడ్డుకునేలా కోర్టు ఉత్తర్వులు
- కోర్టు తీర్పుపై హ్యాపీ, శాడ్ అంటూ స్పందించిన విజయ్ దేవరకొండ
- 'డియర్ కామ్రేడ్' నుంచే తనపై ఆర్గనైజ్డ్ ఎటాక్స్ జరిగాయన్న విజయ్
- మెగాస్టార్‌కే ఈ పరిస్థితి రావడంపై ఆవేదన
- ఇప్పటికైనా ఈ సమస్య బయటకు రావడం సంతోషమన్న హీరో
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాపై వ్యవస్థీకృత నెగెటివ్ ప్రచారాన్ని అడ్డుకుంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ పరిణామంపై కొంత సంతోషంగా, కొంత విచారంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై దురుద్దేశపూర్వక రేటింగ్‌లు, సమీక్షలను నిరోధించేలా కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విజయ్ దేవరకొండ ఒక పోస్ట్ పెట్టారు. "ఈ వార్త చూడగానే సంతోషం, బాధ రెండూ కలిగాయి. ఎంతోమంది కష్టం, కలలు, డబ్బు దీనివల్ల రక్షించబడుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ మనవాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారనే వాస్తవం బాధ కలిగిస్తోంది" అని పేర్కొన్నారు.
తన 'డియర్ కామ్రేడ్' సినిమా విడుదల సమయం నుంచే ఇలాంటి ఆర్గనైజ్డ్ దాడులను గమనిస్తున్నానని విజయ్ గుర్తుచేశారు. "ఇన్నాళ్లూ నా గొంతు ఎవరికీ వినిపించలేదు. మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకు చెప్పారు. కానీ నాతో సినిమా తీసే ప్రతి నిర్మాత, దర్శకుడికి ఈ సమస్య తీవ్రత ఏంటో తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి పనులు చేసేవాళ్లు ఎలాంటి వాళ్లా అని ఎన్నో రాత్రులు నిద్రలేకుండా ఆలోచించాను" అని తన ఆవేదనను వెల్లడించారు.
"మెగాస్టార్ అంతటి పెద్ద, శక్తివంతమైన నటుడి సినిమాకే ఇలాంటి ముప్పు రావడాన్ని ఇప్పుడు కోర్టు గుర్తించడం సంతోషంగా ఉంది. ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినా, ఒక ఆందోళన తగ్గుతుంది" అని విజయ్ తన పోస్ట్‌లో తెలిపారు. ఈ సంక్రాంతికి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో పాటు అన్ని చిత్రాలు బాగా ఆడాలని ఆయన ఆకాంక్షించారు.