Chiranjeevi: రేపు చిరు సినిమా రిలీజ్... అంబటి రాంబాబు స్పందన
- చిరంజీవి కొత్త సినిమాకు అంబటి రాంబాబు శుభాకాంక్షలు
- తన అభిమాన నటుడు చిరంజీవి అని వ్యాఖ్య
- 'మన శంకర వరప్రసాద్ గారు' సూపర్ హిట్ కావాలని ఆకాంక్ష
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంబటి పోస్ట్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రేపు (జనవరి 12) రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విజయం సాధించాలని అంబటి రాంబాబు కోరుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంబటి రాంబాబు ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. "నా అభిమాన నటుడు చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. చిరంజీవితో గతంలో దిగిన ఒక ఫొటోను కూడా ఆయన ఈ పోస్టుకు జతచేశారు.
కాగా, మన శంకర వరప్రసాద్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తుండడం, చిరంజీవి తనదైన కామెడీ, యాక్షన్ టచ్ ను ఇవ్వడం, తొలిసారిగా చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబో తెరపై కనిపించనుండడం వంటి అంశాలతో ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందులో చిరంజీవి సరసన నయనతార జంటగా నటించింది.