Prabhas: ప్రభాస్ 'ది రాజా సాబ్'లో కీలక మార్పు... ఇక థియేటర్లలో ఆ సీన్ కూడా!

Prabhas The Raja Saab Upside Down Fight Scene Added to Theaters
  • ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రంలో మార్పులు
  • కొత్తగా తలకిందులు ఫైట్ సీక్వెన్స్ జోడింపు
  • అన్ని థియేటర్లలో ఈ సీన్‌ను ప్రదర్శిస్తున్నట్లు ప్రకటన
  • ప్రభాస్ నటిస్తున్న తొలి పూర్తిస్థాయి హారర్ చిత్రమిది
  • ఇప్పటికే ట్రైలర్‌లోని తలక్రిందుల సీన్లకు మంచి రెస్పాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్'కు సంబంధించి మేకర్స్ ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అప్‌సైడ్ డౌన్ ఫైట్ సీక్వెన్స్'ను చిత్రానికి జోడించినట్లు ఆదివారం ప్రకటించారు. ప్రస్తుతం అన్ని థియేటర్లలో ఈ కొత్త వెర్షన్ ప్రదర్శితమవుతోంది.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. "'ది రాజా సాబ్'లోని అప్‌సైడ్ డౌన్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు అన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఎంతో థ్రిల్ ను కలిగించే ఈ అనుభూతి కోసం టికెట్లు బుక్ చేసుకోండి" అని పోస్ట్ చేసింది. జనవరి 9న విడుదలైన ఈ చిత్రంలో మొదట ఈ ఫైట్ లేదు. ఇప్పుడు దానిని చేర్చడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా షూటింగ్ కోసం రెండు భారీ సెట్లు నిర్మించినట్లు గతంలోనే మేకర్స్ తెలిపారు. కథలో కీలకమైన రాజభవనం సెట్‌తో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల కోసం అదే భవనాన్ని తలక్రిందులుగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ప్రభాస్ తలక్రిందులుగా సింహాసనంపై కూర్చుని చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రభాస్ కెరీర్‌లో పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఇదే తొలిసారి. నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, మొదటి రోజే ఈ చిత్రం రూ.112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో అదరగొట్టింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ అందించగా, తమన్ సంగీతం సమకూర్చారు.
Prabhas
The Raja Saab
Maruthi
People Media Factory
Upside Down Fight Sequence
Malavika Mohanan
Nidhi Agarwal
তেলেలుగు మూవీ
Horror Comedy Film
Prabhas movie

More Telugu News