పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ.. వీడియో ఇదిగో!

  • సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెబాట పట్టిన పట్నం వాసులు
  • నిన్న ఒక్క రోజే ఏపీకి 60 వేల వాహనాలు
  • ఆదివారం కావడంతో ఈరోజు మరింత రద్దీ
సంక్రాంతి పండుగకు పట్నం వాసులు పల్లెబాట పట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో సొంతూర్లకు వెళుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ నెలకొంది. నిన్న ఒక్కరోజే సిటీ నుంచి ఏపీకి 60 వేల వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఈ రోజు ఆదివారం కావడంతో మరింత ఎక్కువ రద్దీ నెలకొందని చెప్పారు.

మరోవైపు రోడ్డు నిర్మాణ పనులతో ఏపీలోని నందిగామ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సొంత వాహనాలలో జనం రోడ్డెక్కడంతో హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. రద్దీ కారణంగా ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం ఎక్కువ టోల్‌బూత్‌లు తెరిచారు.


More Telugu News