దర్శకుడితో కలిసి రవితేజ తీన్మార్ స్టెప్పులు.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాస్ జాతర!

  • 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి
  • దర్శకుడు, హీరోయిన్లతో కలిసి స్టేజ్‌పై రవితేజ తీన్మార్ డ్యాన్స్‌
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్ మహారాజా స్టెప్పులు
  • ఈ నెల‌ 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల
మాస్ మహారాజా రవితేజ తనదైన ఎనర్జీతో మరోసారి అభిమానులను ఉర్రూతలూగించారు. ఆయన హీరోగా నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు, హీరోయిన్లతో కలిసి వేసిన తీన్మార్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్ నిన్న‌ రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.

సంక్రాంతి కానుకగా ఈ నెల‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ నిర్వ‌హించింది. 

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ వంటి ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈవెంట్‌లో అసలైన సందడి మొదలైంది స్టేజ్‌పైనే. హీరో రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల, హీరోయిన్లు ఆషిక, డింపుల్ కలిసి తీన్మార్ బీట్‌కు మాస్ స్టెప్పులు వేశారు. ముఖ్యంగా రవితేజ, కిశోర్ తిరుమల మధ్య కెమిస్ట్రీ, వారి ఎనర్జీ అందరినీ ఆకట్టుకుంది. ఈ మాస్‌ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేసింది.


More Telugu News