మా అల్లరి ఎలా ఉంటుందో థియేటర్‌లో చూస్తారు: హీరో రవితేజ

  • ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో ఫైట్లు కూడా హాస్యంగా, ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయన్న రవితేజ
  • అనిల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌, బాబీ, కిశోర్‌ లాంటి దర్శకులతో పని చేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడి
  • ఈ సినిమాతో తనకు, దర్శకుడు కిశోర్‌కు మంచి హిట్‌ ట్రాక్‌ ఏర్పడాలన్న రవితేజ
ఆద్యంతం నవ్వులతో సాగే పూర్తి వినోదాత్మక చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో తాను, ఆషికా, డింపుల్‌ కలిసి చేసిన అల్లరి ఎలా ఉంటుందో థియేటర్లలోనే చూడాలని హీరో రవితేజ అన్నారు. రవితేజతో పాటు ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కిశోర్‌ తిరుమల తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకులు హరీశ్‌ శంకర్‌, బాబీ, శివ నిర్వాణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫైట్లు కూడా హాస్యంగా, ప్రేక్షకులను నవ్వించేలా ఉంటాయన్నారు.

తాను ఈ సినిమాలో అందంగా కనిపించానంటే అందుకు కారణం సినిమాటోగ్రాఫర్‌ ప్రసాద్‌ మూరెళ్లేనని పేర్కొన్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి పని చేయడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తానని చెప్పారు. అనిల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌, బాబీ, కిశోర్‌ లాంటి దర్శకులతో పని చేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ సినిమాతో తనకు, దర్శకుడు కిశోర్‌కు మంచి హిట్‌ ట్రాక్‌ ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని రవితేజ ధీమా వ్యక్తం చేశారు. 


More Telugu News