ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఔట్ విజయవంతంగా మూసివేత... మంత్రి నారా లోకేశ్ స్పందన
- కోనసీమ జిల్లా ఇరుసుమండలో వారం రోజులుగా గ్యాస్ బ్లోఔట్
- విజయవంతంగా మూసివేత
- నిపుణుల బృందానికి, అధికారులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
- సీఎం చంద్రబాబు పర్యవేక్షణ వల్లే వేగంగా స్పందించగలిగామన్న లోకేశ్
- డబుల్ ఇంజన్ సర్కార్ వేగానికి ఇది నిదర్శనమన్న ఎంపీ హరీశ్ బాలయోగి
కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో వారం రోజులుగా ప్రజలను భయాందోళనలకు గురిచేసిన గ్యాస్ బ్లోఔట్‌ను ఓఎన్జీసీ నిపుణులు విజయవంతంగా మూసివేశారు. ఈ పరిణామంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఇరుసుమండ బ్లోఔట్‌ను విజయవంతంగా అదుపులోకి తెచ్చేందుకు అహర్నిశలు శ్రమించిన ఓఎన్జీసీ నిపుణుల బృందానికి, జిల్లా యంత్రాంగానికి, ఎంపీ హరీశ్ బాలయోగికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ, నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం వేగంగా, సానుభూతితో స్పందిస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.
అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి కూడా ఈ విషయంపై స్పందించారు. అతి తక్కువ సమయంలో బ్లోఔట్‌ను మూసివేసిన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారని, సీఎంవో నిరంతరం పర్యవేక్షించిందని చెప్పారు. డబుల్ ఇంజన్‌తో కూడిన ఎన్డీఏ సర్కార్ బుల్లెట్ వేగంతో పనిచేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తన జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హరీశ్ బాలయోగి భరోసా ఇచ్చారు. ఈ బ్లోఔట్ మూసివేతతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.