Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం... తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ
- పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పోటీ చేయాలని నిర్ణయం
- నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడి
- పార్టీని, పవన్ కల్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యమన్న జనసేన
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసేన విభాగం నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేరుతో ప్రకటన విడుదలైంది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, సాధ్యమైనన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న జనసైనికులు, వీరమహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.