బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్మన్‌గా తారిఖ్ రెహ్మాన్

  • అనారోగ్య సమస్యలతో ఖలీదా జియా మరణం
  • పదవి ఖాళీ కావడంతో ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రెహ్మాన్
  • 2025 ఆఘస్టు 5కు ముందు నాటి పరిస్థితులు ఉండవన్న రెహ్మాన్
గత ఏడాది ఆగస్టు 5కు ముందు నాటి రాజకీయ పరిస్థితులు పునరావృతం కాబోవని, దేశం అలాంటి వాతావరణాన్ని కోరుకోవడం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నూతన ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ పేర్కొన్నారు. బీఎన్‌పీ ఛైర్మన్‌గా తారిఖ్ రెహ్మాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనారోగ్య సమస్యలతో ఆ పార్టీ ఛైర్‌పర్సన్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించడంతో ఈ పదవి ఖాళీ అయింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రెహ్మాన్‌ను పార్టీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ వెల్లడించారు. ఈ సందర్భంగా తారిఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ, 2025 ఆగస్టు 5కు ముందు నాటి పరిస్థితులు ఉండబోవని, షేక్ హసీనా పాలనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తారిఖ్ రెహ్మాన్ ముందు వరుసలో ఉన్నారు.


More Telugu News