చిరంజీవి సినిమా టిక్కెట్ ధరల పెంపు... హైకోర్టులో పిటిషన్ దాఖలు

  • తెలంగాణలో టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి
  • టిక్కెట్ ధరల పెంపుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
  • కోర్టు పని దినాల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి లభించింది. అయితే, ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విజయ్ గోపాల్ టిక్కెట్ ధరల పెంపును హైకోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ధరలను పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే హౌస్ మోషన్ విచారణను హైకోర్టు నిరాకరించింది. కోర్టు పని దినాలలో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో ఈ నెల 19న న్యాయవాది విజయ్ గోపాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా, జనవరి 11న 'మన శంకర వరప్రసాద్‌ గారు' స్పెషల్ ప్రీమియర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టిక్కెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 టిక్కెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.


More Telugu News